Showing posts with label ఈశ్వర్ (2003). Show all posts
Showing posts with label ఈశ్వర్ (2003). Show all posts

కోటలోని రాణి పేట పోరగాణ్ణి


కోటలోని రాణి
చిత్రం : ఈశ్వర్ (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : కౌసల్య, రనీనా రెడ్డి, నిహాల్, రాజేష్, ఉష

కోటలోని రాణి పేట పోరగాణ్ణి పెళ్లి చేసుకుంటానంటావా
మేడలలో దొరసాని మా వాడ చూశావా
గాలి కూడా రాని గల్లీ లోనే కాపురముంటానంటావా
పేదల బస్తీలోనే నీ గూడు కడతావా
ఎప్పుడూ తోటరాముణ్ణే కోరుకుంటుంది యువరాణీ
ఎందుకో ఏమో ప్రేమనే అడిగి తెలుసుకోవచ్చుగా

అమీర్ పేటకి ధూల్ పేటకి


అమీర్ పేటకి ధూల్ పేటకి
చిత్రం : ఈశ్వర్ (2003)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
రచన : సిరివెన్నెల
గానం : ఆర్.పి.పట్నాయక్

కోరస్ :

ధం ధమాధం ఢోల్ బజా షోర్ మచా
ధన్ ధనాధన్ చెయ్ రా చిచా మస్త్ మజా

పల్లవి :

అమీర్ పేటకి ధూల్ పేటకి షహరొకటే రా
కార్లకైనా కాళ్లకైనా సడకొకటే రా
ఎవడి కలల కోటకి మహరాజు వాడేరా
ఎగిరిపడే నవాబ్ గిరి  చెల్లదు పోరా
అరె చల్ బే తెగ డబ్బుందని కళ్లు నెత్తికెక్కితే చెడతవు భయ్
మరీ ఫోజేస్తే మా దమ్ముతో నీ దుమ్ముని దులిపితే దిక్కెవడోయ్