Showing posts with label ఇద్దరు మిత్రులు (1999). Show all posts
Showing posts with label ఇద్దరు మిత్రులు (1999). Show all posts

బంగారం తెచ్చి

ఇవాళ గర్ల్ ఫ్రెండ్స్ డే సందర్భంగా

బంగారం తెచ్చి
చిత్రం: ఇద్దరు మిత్రులు (1999)
సంగీతం: మణిశర్మ
సాహిత్యం: చంద్రబోస్
గానం: చిత్ర, పార్థసారథి

బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా
ఇన్నాళ్ళ నుంచి కన్న కలలు తెచ్చి అరుదైన రూపం ఇయ్యమ్మా
పింఛం కుంచెగా మారనీ మురిపించే చిత్రం చూడనీ
వీరి వీరి గుమ్మాడీ... వాడి పేరేంటమ్మా అమ్మాడీ...ఓ....
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా

జో లాలీ అని కొత్త రాగాలెన్నో పలుకమ్మా తీయగా
ఈ మంచుబొమ్మ పంచప్రాణాలతో నిలువెల్లా విరియగా
అమ్మా అంటుంది కమ్మగా పసిపాప తేనెపాట
అమ్మాయిగారు అమ్మగా పదవిని పొందునట
ఇల్లంతా బొమ్మలకొలువు మనసంతా నవ్వుల నెలవు
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాలబొమ్మ గీయమ్మా

అడగక ముందే అన్నీ చేసి సేవకుడివి అనిపిస్తావు
అలిసిన ఆశకి జీవం పోసి దేవుడిలా కనిపిస్తావు
ఏ జన్మలోనూ నే తీర్చలేని ఋణమై బంధించావు
నీ స్నేహంతోనే చిగురించమని వరమే అందించావు
ఎపుడూ నా కళ్ళు చూడని వెలుగే చూపించినావు
ఎపుడూ నా గుండె పాడని మధురిమ నేర్పావు

నీలికళ్ళే చిందే తడిలో హరివిల్లే రానీ త్వరలో ...ఓ....

మాతృత్వానికి మగరూపానివై నాన్నతనంలో కర్ణుడివై
అన్న గుణంలో కృష్ణుడివై
బతుకంతా జతగా నిలిచే విధిలో పతినే మించిన తోడువై
బంధుత్వాలకి అందని బంధం ఉందని చూపిన నేస్తమా