Showing posts with label ఇంద్ర (2002). Show all posts
Showing posts with label ఇంద్ర (2002). Show all posts

భంభం భోలే

భంభం భోలే
చిత్రం : ఇంద్ర (2002)
సంగీతం : మణిశర్మ
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : హరిహరన్,  శంకర్ మహదేవన్ 

పల్లవి :

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే

దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..
దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..

విలాసంగా శివానందలహరి... మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడి రేగనీ
పొద్దు లెరుగని పరుగై ముందుకు సాగనీ..

విలాసంగా శివానందలహరి... మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...

భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనా
భంభంభోలే భంభంభోలే భంభంభోలే భోలేనా

భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం
ఢమరూభాజే ఢమరూభాజే ఢమరూభాజే ఢంఢమాఢం
భోలేనాచే చంకుచమాచం భోలేనాచే చంకుచమాచం

చరణం 1 :

వారణాసిని వర్ణేంచే నా గీతికా
నాటి శ్రీనాధుని కవితై వినిపించగా
ముక్తికే మార్గం చూపే మణికర్ణికా
అల్లదే అంది నా ఈ చిరు ఘంటిక

నమక చమకాలై యద లయలై కీర్తన చేయగా
యమక గమకలై పద గతులై నర్తన చేయగా
ప్రతి అడుగు తరిస్తోంది ప్రదక్షణంగా.. ఆ.. ఆ

విలాసంగా శివానందలహరి మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

కార్తీక మాసాన వేవేల దీపాల వెలుగంత శివలీల కాదా
 ప్రియమార మదిలోన ఈశ్వరుని ధ్యానిస్తే మన కష్టమే తొలగిపోదా

చరణం 2:

ఏ... దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం
దమాదం దమాదం
దందమాదం దం దందమాదం దం దందమాదం దం
దమాదందం దం దం దం

ఎదురైయే శిల ఏదైన శివలింగమే
మన్ను కాదు మహాదేవుని వరదానమే..
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిది ఈ కైలాసమే

గాలిలో నిత్యం వినలేదా ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా శివ కారుణ్యమే
తరలిరండి తెలుసుకొండి కాశి మహిమా

విలాసంగా శివానందలహరి.. మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ

భంభం భోలే శంఖం మోగేలే
ఢంఢం ఢోలే చలరేగిందిలే
దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..

దద్ధినిక ధిన్ దరువై సందడిరేగనీ
పొద్దులెరుగని పరుగై ముందుకు సాగనీ..

విలాసంగా శివానందలహరి... మహగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగ చేరీ వరాలిచ్చె కాశీపురీ...

జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే
జయహో జయహో భంభం భోలే...