Showing posts with label అమ్మ రాజీనామా (1991). Show all posts
Showing posts with label అమ్మ రాజీనామా (1991). Show all posts

ఎవరు రాయగలరు



ఎవరు రాయగలరు
అమ్మ రాజీనామా (1991),
సిరివెన్నెల,
చక్రవర్తి,
చిత్ర

ఎవరు వ్రాయగలరు
అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు
అమ్మ అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా... అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మపేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా... అమ్మేగా చిరునామా ఎంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంతగొప్ప అమ్మని

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
శ్రీరామరక్ష అంటూ నీళ్ళుపోసి పెంచింది
ధీర్గాయురస్తు అంటూ నిత్యం దీవించింది
నూరేళ్ళు ...నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మచేతి వేళ్ళతో
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం
అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తియ్యని రాగం

సృష్టికర్త ఒక బ్రహ్మ



సృష్టికర్త ఒక బ్రహ్మ
చిత్రం : అమ్మ రాజీనామా (1991)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి నారాయణరావు
గానం : ఏసుదాస్

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆ అమ్మకే.. తెలియని.. చిత్రాలు ఎన్నో
ఈ సృష్టినే స్థంభింపచేసే తంత్రాలు ఎన్నో

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

బొట్టు పెట్టి పూజ చేసి.. గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే.. గోవు తల్లే కోత కోత
బొట్టు పెట్టి పూజ చేసి  గడ్డి మేపి పాలు తాగి
వయసు ముదిరి వట్టి పోతే గోవు తల్లే కోత కోత

విత్తు నాటి చెట్టు పెంచితే
చెట్టు పెరిగి పళ్ళు పంచితే
తిన్న తీపి మరిచిపోయి
చెట్టు కొట్టి కట్టెలమ్మితే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఆకు చాటు పిందె ముద్దు.. తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే.. కన్నతల్లే అడ్డు అడ్డు
ఆకు చాటు పిందె ముద్దు తల్లి చాటు బిడ్డ ముద్దు
బిడ్డ పెరిగి గడ్డమొస్తే కన్నతల్లే అడ్డు అడ్డు

ఉగ్గు పోసి ఊసు నేర్పితే
చేయి పట్టి నడక నేర్పితే
పరుగు తీసి పారిపోతే
చేయి మార్చి చిందులేస్తే

లోకమా ఇది న్యాయమా
లోకమా ఇది న్యాయమా

సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ
సృష్టికర్త ఒక బ్రహ్మ
అతనిని సృష్టించినదొక అమ్మ

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు



ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
చిత్రం: అమ్మ రాజీనామా (1991)
సంగీతం: కె.చక్రవర్తి
సాహిత్యం: సిరివెన్నెల
గానం: బాలు

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని

ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు

పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు బార్యయై
బిడ్డకు తల్లియై ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా
నవ్వులు ఏడుపులు కలిపి దిగమింగి ఇంటినే గుడిచేసిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు

భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసియై సేవకు నిలయమై ఆగని యంత్రమై
నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి
బ్రతుకే హారతి ఇచ్చిన దేవతా
శలవిమ్మని అడిగితే...
ఇక శలవిమ్మని అడిగితే...
ఇది కనని వినని సంఘటన... అపూర్వ సంఘటన

ఇది ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు
ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు
దేవతా తరలిపో తల్లిగా మిగిలిపో
వదలలేక వదలలేక గుండె రాయి చేసుకొని
ఎవ్వరూ ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు