July 17, 2021

ఈ బ్రతుకే ఒక ఆట


ఈ బ్రతుకే ఒక ఆట 
చిత్రం: ఇద్దరూ అసాధ్యులే (1979)
సంగీతం: సత్యం
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి:

తల్లొక చోటా 
పిల్లొక చోటా  
కొమ్మలేదట 
గూడూ లేదట 
ఏ వేటగాడో 
విడదీసినాడటా... 
 
ఈ బ్రతుకే ఒక ఆట 
ఇది దేవుడు ఆడే పిల్లాట 
మనుషులు, మాకులు 
పశువులు, పక్షులు 
అన్నీ బొమ్మలటా...
అన్నీ బొమ్మలటా...

చరణం 1:

చేసిన త్యాగం చెరగని మచ్చై
చెరసాల పాలైనదీ కన్నతల్లి 
అమ్మచేతి అన్నానికి వెలియై 
అనాధ అయినది ఈ చిట్టితల్లి 

చెల్లెలు కానీ చెల్లెలి కోసం 
వెల్లువయిందో పాలవెల్లి 
విడదీసిన వాడెవడో గానీ 
కలిసేదెపుడీ బ్రతుకులు మళ్ళీ 

చరణం 2:

నెత్తురుకీ తన నెత్తురు ఏదో 
గుర్తేనంటారు 
నెత్తిన వ్రాసిన జిలుగు రాతలు 
గుర్తించేదెవరు?

పామును, కప్పను 
పులినీ, మేకను 
ప్రేమ కలుపుతుంది 
దేవుని ఆటకు ప్రేమగీతమే 
నాంది పలుకుతుంది 

చరణం 3:

ఎవరికెవరు చెల్లీ ఈ లోకంలో 
ఎవరు నీకు తోడూ ఈ పయనంలో 
పసుపుకుంకుమతో 
మెట్టినింటికి పంపాలనుకుంటే 
మనసులేని ఒక మానవ మృగము 
మట్టిని కలిపిందే...

నోరులేని ఈ జీవాలే 
నీ బంధువులమ్మా 
ఆరని నా కన్నీరే నీకు 
తర్పణమమ్మా