చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
మనీ(1994)
సంగీతం:శ్రీ
గానం:బాలు
రచన:సిరివెన్నెల
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ
బంధువౌతానని అంది మనీ మనీ
అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు
అయినా అన్నీ అంది మనీ మనీ
పచ్చనోటుతో లైఫు లక్ష లింకులు
పెట్టుకుంటుందని అంది మనీ మనీ
పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య
అంతా తనే అంది మనీ మనీ
కాలం ఖరీదు చేద్దాం పదండి అంది మనీ మనీ
తైలం తమాషా చూద్దాం పదండి అంది మనీ మనీ