ఈ అబ్బాయి చాలా మంచోడు (2003)
రచన: చంద్రబోస్
సంగీతం: కీరవాణి
గానం: సునీత, కళ్యాణి మాలిక్
పల్లవి :
చందమామ కథలో చదివా
రెక్కలగుర్రాలుంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
బాలమిత్ర కథలో చదివా
పగడపుదీవులు ఉంటాయని
నమ్మడానికి ఎంత బాగుందో
నా కోసం రెక్కలగుర్రం ఎక్కి వస్తావనీ
పగడపుదీవికి నువ్వే నన్ను తీసుకెళ్తావనీ
ఇక ఏనాటికీ అక్కడే మనము ఉంటామనీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో
నువ్వే నాకు ముద్దొస్తావనీ
నేనే నీకు ముద్దిస్తాననీ
నమ్మడానికి ఎంత బాగుందో
నమ్మడానికి ఎంత బాగుందో