వయసా చూసుకో

ప్రేమంటే ఇదేరా (1998)
రచన: సిరివెన్నెల 
సంగీతం: రమణ గోగుల 
గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

వయసా చూసుకో 
చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం

సొగసా చేరుకో 
వరసే అందుకో
నీకిది తొలి గీతం

ఆగనన్నది ఆశ 
ఎందుకో తెలుసా

ఓ ఊహకందని భాష
నేర్చుకో మనసా
 
ఓ స్వామి రారా 
ప్రేమంటే ఇదేరా

నా సితార 
ప్రేమంటే ఇదే...రా

వయసా చూసుకో 
చెబుతా రాసుకో
ఈడుకి తొలి పాఠం

సొగసా చేరుకో 
వరసే అందుకో
నీకిది తొలి గీతం

చరణం 1:

రేయి భారం రెట్టింపయ్యింది
లేవయ్యారం నిట్టూరుస్తుంది

రాయబారం గుట్టే చెప్పింది
హాయి బేరం గిట్టేలా ఉంది

మోయలేని ప్రేమంటే ఇదేరా
సాయమడిగే ప్రేమంటే ఇదే...రా

వయసా చూసుకో

చరణం 2:

తేనె మేఘం కాదా నీ దేహం
వానరాగం కోరే నా దాహం

గాలి వేగం చూపే నీ మోహం
తాకగానే పోదా సందేహం

ప్రాణం ఉంది ప్రేమంటే ఇదేరా
ప్రాయం అంది ప్రేమంటే ఇదే

వయసా చూసుకో

No comments:

Post a Comment

Leave your comments