చిత్రం: మాతృదేవోభవ (1993)
సంగీతం: కీరవాణి
గీతరచయిత: వేటూరి
నేపథ్యగానం: చిత్ర, బాలు
పల్లవి :
రాగం అనురాగం సంసారం
బంధం అనుబంధం సంగీతం
ఇద్దరుంటే పంచదార సాగరం
ఇల్లు చూస్తే మల్లెపూలపంజరం
అహహా . ..ఆ . ..
రాగం అనురాగం సంసారం
బంధం అనుబంధం సంగీతం
చరణం 1:
గోడమీద బొమ్మ
గొలుసులబొమ్మా
వచ్చేపోయేవారికి
వడ్డించు బొమ్మా
ఏంటో చెప్పమ్మా....
తేలూ.....
ఊమ్....
పగలేమో రెండే కాళ్ళు
చీకటి పడితే
నాలుగు కాళ్ళు
జంతువు కాదు మనిషే..
ఎవరూ....
ఇంకెవరూ నాన్నే
ఏయ్...
చిరుచిరు నవ్వుల్లో
చిన్నారి గువ్వల్లో
చీకటింట దీపమెట్టాలా..
కనులు అదిరేలా... హా
కలలు కనవేలా....
ముసి ముసి ముద్దుల్లో
ముగ్గుతున్న పొద్దుల్లో
వెన్నెలింట వేడిపుట్టాల...
పెదవి వెనకాలా...... హా
మధువులొలకాలా
ఒడిలో.... పాప
బడిలో....పాప
జతకే.... కంటిపాప
ఎదలో... పాప
ఎదుటే...పాప
చెలి నా... పాప
చెలాకి సొగసుల
రాగం అనురాగం సంసారం
బంధం అనుబంధం సంగీతం
చరణం 2:
రాతిరి చేసిన తప్పులు అన్నీ
పొద్దుట మన్నించేస్తుందీ
ఎన్నిసార్లు మాటతప్పినా....
మన్నించాను పో అంటుంది
ఆ దేవత ఎవరూ ...
కనకదుర్గమ్మా...
కా.... దు
పోలేరమ్మా... ?
కా.. దు
మరియమ్మా....
కాదమ్మా.... మీ అమ్మ
తొలకరి తోటల్లో
వాగుల్లో వంకల్లో
ఎంకి పాట
ఏతమవ్వాలా..
మనసు కవి పాటా.....
ఆ
మనకు విరిబాటా....
తిరుపతి కొండల్లో కోనల్లో కోవెల్లో
ఏడు జన్మలేకమవ్వాలా...
తెలుగు హరి పాటా.... హా
తేనియల తేటా...
చిరుకోపాల చెలి రూపాలు
పరిచే పక్క పాలూ..
మమతాపాల కసి ధూపాలు
అపుడే కాదు పదండి అనగల
రాగం అనురాగం సంసారం
బంధం అనుబంధం సంగీతం
No comments:
Post a Comment
Leave your comments